శేరిలింగంపల్లి, మే 11 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండా గిరిజన సంక్షేమ సంఘం భవనంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర నేత్రాలయ ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం చాలా అభినదించదగ్గ విషయం అని, శిబిరంలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, కంటిశుక్లం ఉన్న వారికి ఉచిత శస్త్ర చికిత్స చేయడం జరుగుతుందని అన్నారు. ఉచిత కంటి వైద్య శిబిరంలో శస్త్ర చికిత్స అవసరం ఉన్న వారిని ఎంపిక చేసి వెంటనే సంస్థ బస్సులలో తీసుకెళ్తారని, బాధితులు వచ్చేటప్పుడు ఆధార్ కార్డు జిరాక్స్, ఫోన్ నంబర్, వాడుతున్న మందులను తీసుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు , కార్యకర్తలు, వైద్య సిబ్బంది, కాలనీవాసులు, మహిళలు పాల్గొన్నారు.