శేరిలింగంపల్లి, మే 11 (నమస్తే శేరిలింగంపల్లి): మియపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువు, మక్తా మహబూబ్ పేట్ లోని పెద్దకుడి చెరువుల సుందరీకరణలో భాగంగా Nexus select Malls కంపెనీ CSR ఫండ్స్ ద్వారా మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేపట్టనున్న చెరువుల పునర్జీవనంలో భాగంగా సుందరీకరణ, పునరుద్ధరణ పనులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ చెరువుల సుందరీకరణ పనులు చేపడుతున్నామని, అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అధికారులకు తెలియచేశారు.ఈ కార్యక్రమంలో CSR ఐటీ సంస్థ ప్రతినిధి చైతన్య, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
హఫీజ్‌పేట డివిజన్‌లో..
హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని కైదమ్మ కుంట చెరువు సుందరీకరణలో భాగంగా Nexus select Malls కంపెనీ CSR ఫండ్స్ ద్వారా మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేపట్టనున్న చెరువు పునర్జీవనంలో భాగంగా సుందరీకరణ, పునరుద్ధరణ పనులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో CSR ఐటి సంస్థ ప్రతినిధి చైతన్య, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.