శేరిలింగంపల్లి, మే 11 (నమస్తే శేరిలింగంపల్లి): సాయుధ పోరాట యోధుడు, మాజీ శాసనసభ్యుడు,యంసిపిఐ(యు) వ్యవస్థాపక నేత మద్ది కాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుతున్నామని యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వనం సుధాకర్ అన్నారు. మియాపూర్ స్టాలిన్ నగర్ లోని యంసిపిఐ(యు) కార్యాలయంలో ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా వనం సుధాకర్ మాట్లాడుతూ రాజకీయ, సైద్దాంతిక, వ్యక్తిగత అనేక అంశాలు ఈనాటి తరానికి, అన్ని వర్గాల ప్రజలకు మరింత తెలియని, ప్రస్తుత అవినీతి అవకాశవాద రాజకీయ విధానాలను మరింత ఎండగడుతూ రాజకీయ విలువలను కాపాడటం కోసం ప్రజా చైతన్య కార్యక్రమంలో భాగంగా మద్ది కాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవం ఈ నెల 12 న వరంగల్ జిల్లా మచ్చపూర్ లోని ఓంకార్ 125 అడుగుల భారీ స్మారక స్తూపం వద్ద ప్రారంభం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వామపక్ష కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర నాయకులతో పాటు కవులు, కళాకారులు, మేధావులు, ప్రజాతంత్ర వాదులు హాజరవుతున్నారని, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.