హఫీజ్ పేట్ (నమస్తే శేరిలింగంపల్లి): తెరాస పార్టీకి ప్రజలు ఓటు వేసి మోసపోవద్దని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని ఇంద్రారెడ్డి ఆల్విన్‌కాలనీ డివిజన్ బీజేపీ అభ్యర్థి బోయిని అనూష మహేష్ యాదవ్ తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

అనంతరం ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల కాలంలో జీహెచ్ఎంసీలో తెరాస చేసిందేమీలేదన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే మళ్లీ తెరాస ఇచ్చిందని, తెరాస చెబుతున్న మాటలను ప్రజలు నమ్మవద్దని కోరారు. గ్రేటర్ హైదరాబాద్ సుస్థిర అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమన్నారు. బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేసి వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జ్ఞానేంద్ర ప్రసాద్, రాష్ట్రనాయకులు మొవ్వా సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్ రావు, నాయకులు కోటేశ్వరరావు, రవి గౌడ్, వర ప్రసాద్, టర్బో శ్రీను, పృథ్వి కాంత్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
