కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

శేరిలింగంపల్లి‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. రోడ్ షోలో భాగంగా శనివారం చందానగర్, మియపూర్ ప్రాంతాల్లో మాజీ మంత్రి గీతారెడ్డి, ఎంపీ పొన్నం ప్రభాకర్, సీనియర్ నాయకులు రఘునందన్ రెడ్డి, మ‌హమ్మద్ నిజాముద్దీన్ లతో పాటు కార్పొరేట‌ర్‌ అభ్యర్థులు ఆస్కరి బేగం, ఇలియాజ్ షరీఫ్ లకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కల్లబొల్లి మాటలు చెప్పే కాషాయ, గులాబీ పార్టీ నాయకులు చెప్పే మాటలు నమ్మవద్దని, నిజాయితీ గల స్థానిక అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. గల్లీలో జరిగే పోరులో ఢిల్లీ వాళ్లకు ఇక్కడేం పని అని ప్రశ్నించారు. స్థానిక అభ్యర్థులకు తాను ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపిస్తేనే బస్తీ సమస్యలు తీరుస్తారని తెలిపారు. అమ్మలు, అన్నలు, యువకులు ఒక్కసారి ఆలోచించి హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మన్నే సురేష్ ముదిరాజ్, తిరుపతి, ఆసిఫ్ పటేల్, హాజమత్ పటేల్, యాసిన్ పటేల్, కృష్ణ, శ్రావణ కుమార్, నరేందర్ ముదిరాజ్, నర్సింహులు ముదిరాజ్, జకీర్ పాల్గొన్నారు.

రోడ్‌షోలో భాగంగా మాట్లాడుతున్న ఉత్త‌మ్ కుమార్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here