వ‌ర్షాకాలం నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని హుడా ట్రేడ్ సెంటర్, మసీదు బండ ప్రభు పాద లే ఔట్, సుదర్శన్ నగర్ కాలనీలలో ముంపు ప్రాంతాలలో నెల‌కొన్న‌ సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ముంపుకు గురయ్యే లోతట్టు ప్రాంతాల్లో సీనియర్ నాయకుడు మారబోయిన రాజు యాదవ్, పలు శాఖల సంబంధిత అధికారులతో కలసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పర్యటించి, పరిశీలించి, సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజలు వర్షాకాలంను దృష్టిలో పెట్టుకొని అప్రమ‌త్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితి అయితే తప్ప ఇంటి నుండి బయటకు రావొద్దు అని అన్నారు. ప్రతి ఒక్కరు కనీస స్వీయ రక్షణ చర్యలు పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో GHMC అధికారులు EE శిరీష, DE ఆనంద్, AE భాస్కర్, AE రషీద్, నాయకులు మారబోయిన రాజు యాదవ్, గణేష్ ముదిరాజు, మల్లేష్ యాదవ్, మల్లేష్ గౌడ్, కొడిచెర్ల రాములు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here