శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): కార్పొరేటర్ రాగం నాగేందర్ ని నోరు అదుపు లో పెట్టుకొని ప్రజల గురించి పోరాడాలని గ్రేటర్ హైదరాబాద్ మాజీ యూత్ ప్రెసిడెంట్ మారబోయిన రవి యాదవ్ సూచించారు. మసీదుబండ బీఆర్ఎస్ ఆఫీస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అదిష్టానం పిలిపు మేరకు మన బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా లింగంపల్లిలోని బస్తీలు తిరుగుతూ నీరు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్స్, ఇతర సమస్యలు ఎత్తి చూపిస్తుంటే కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆ సమస్యలపై మాట్లాడకుండా సమస్యల నుండి తప్పించుకోటానికి వ్యక్తిగత దూషణలకి పూనుకున్నారని అన్నారు. 2020 లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎలక్షన్స్ లో తనని గెలిపించింది బీఆర్ఎస్ సైనికులే అని గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. గెలిచిన వెంటనే సొంత అవసరాల కోసం తల్లి లాంటి పార్టీ మారి ఇప్పుడు ప్రజల సమస్యలపై పోరాడుతున్న తనను, బీఆర్ఎస్ నాయకులని కొత్త బిచ్చగాళ్లు అని దూషణలు చేయటం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. అధికారంలో ఉండి కూడా సమస్యల నుండి తప్పించుకొని తిరుగుతున్న కార్పొరేటర్ కి ప్రజలు తగిన బుద్ధి చెప్పే సమయం దగ్గర్లో ఉందని హెచ్చరించారు. ఇప్పటికైనా వ్యక్తిగత దూషణలు మాని ప్రజల బాగు కోసం పని చేయాలని సూచించారు.

పాపిరెడ్డి కాలనీలోని అండర్ పాస్ బ్రిడ్జి వద్ద నీరు చేరి ప్రజల రవాణా సౌకర్యం ఇబ్బంది అవుతుంది అని తన సొంత నిధులతో 5 సార్లు నీరు తీయించి ప్రజలకి ఆ బ్రిడ్జి అందుబాటులో తెచ్చేలా చేశానని చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాలకు మళ్లీ వర్షపు నీరు చేరి ఒక వ్యక్తి అందులో పడి మరణించాడని, దీనిపై ప్రశ్నించినందుకు నాగేందర్ యాదవ్ వ్యక్తిగత దూషణలకు దిగారని చెప్పారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకి భయపడబోమని, పేద ప్రజల పక్షాన నిలబడి మెడలు వంచి పని చేయిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కే.ఎన్.రాములు, స్వామీనాథ్, వెంకటరెడ్డి, ప్రభాకర్ గౌడ్, శ్రీకాంత్ యాదవ్, గడ్డం శ్రీనివాస్, సురేష్ యాదవ్, గంగాధర్ గౌడ్, నవీన్ గౌడ్, సాయి నందన్ ముదిరాజ్, వెంకటేష్ యాదవ్, పవన్, స్వామి, శ్రీశైలం యాదవ్, రాజు గౌడ్, ప్రవీణ్ యాదవ్, శంకర్, మున్నా, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.





