కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డుల జారీ: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పంపిణీ, రైతు భరోసా వంటి పథకాల‌ అమలుకు ఈ నెల 16 వ తేదీ నుండి 20 వ తేదీ వరకు అధికారుల బృందాలు పర్యటించి అర్హులను గుర్తిస్తాయ‌ని, ఈ చక్కటి సదవకాశం ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ తెలియచేసారు. ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందివ్వడమే ప్రభుత్వ లక్ష్యం అని, ఎలాంటి తారతమ్యాలు లేకుండా లబ్ధిదారుల ఎంపిక జరగాలని , ప్రతి పేదవాడికి సంక్షేమ పథకం అందేలా అధికారులు కృషి చేయాలని, ఈ నెల 16 వ తేదీ నుండి 20 వ తేదీ వరకు అధికారుల బృందాలు పర్యటించి అర్హులను గుర్తిస్తాయి అన్నారు. ఈ చక్కటి సదవకాశం ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలియచేసారు.

PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

పేదవారు కన్న కల ఇందిరమ్మ ఇల్లు అని,పేదవారికి భారం కాకుండా ప్రభుత్వం అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటుంది. పేదవారి కలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుంది అని,ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో తొలి ద‌శ‌లో సొంత స్థ‌లాలున్న వారికే ప్రాధాన్య‌మిస్తున్నందున త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, ఎవరైతే సొంత స్థలంలో ఉంటారో వారి ఇంటి ఫోటో తీసి యాప్ లో నమోదు చేస్తారు అని , ఈ చక్కటి అవకాశం ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, ఇందిరమ్మ ఇంటికి మొదటి విడతగా లక్ష రూపాయలు ఇస్తారు, ఎవరి ఇళ్లు వారే నిర్మించుకునే విధంగా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని, ప్రజాపాలన లో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని గుర్తిస్తున్నారు అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు .ప్రజాపాలన లో దరఖాస్తు చేయని వారు స్పెషల్ కౌంటర్ లో దరఖాస్తు చేసుకోవచ్చు అని, ఒకవేళ దరఖాస్తు చేసిన వారి కుటుంబ సభ్యులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలియచేసారు.

అర్హులైన ,నిజమైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందుతాయి అని ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది అని , గ్రామ, మున్సిపల్ స్థాయిలో సభలు నిర్వహించి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక జాబితాలను సిద్ధం చేస్తారు అని తెలియచేసారు. కొత్త రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న వినతులను పరిష్కరించేందుకు విధివిధానాలను ఖరారు చేసింది. కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈనెల 28వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే ఇందుకు అను గుణంగా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. మంత్రి వర్గం ఉపసంఘం సిఫార్సులకు అనుగు ణంగా లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. క్షేత్రస్థాయి పరిశీలన కోసం ముసాయిదా జాబితాను పంపించి గ్రామసభలు, మునిసిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్లలో జాబితా ప్రదర్శించిన తర్వాత ఆమోదించనుంది. ఈ మేరకు పౌర సరఫరాలశాఖ కమిషనర్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డీఎస్ చౌహాన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అర్హత కలిగిన వ్యక్తి ఒకే ఒక్క రేషన్ కార్డులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల‌లో పేర్కొన్నారు. అలాగే రేషన్ కార్డులో సభ్యుల మార్పులు, చేర్చులు, తొలగింపులకు అవకాశం కల్పించారని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here