వివేకానందనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ డివిజన్ కి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు పురేందర్ రెడ్డి మంగళవారం ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీల సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. ఆయనకు తెరాస పార్టీ కండువా కప్పి సాదరంగా తెరాస పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. వివేకానంద నగర్ డివిజన్ తెరాస కార్పొరేటర్ అభ్యర్థి రోజా రంగారావును అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. మరింత అభివృద్ధి చేసేందుకు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ప్రస్తుతం నగరానికి వేలకోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, ఇంకా వస్తాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం తెరాస ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి ఎక్కువగా జరిగిందన్నారు. తెరాస అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగారావు, డివిజన్ తెరాస అధ్యక్షుడు సంజీవ రెడ్డి, తెరాస నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్, నాయినేని చంద్రకాంత్ రావు, సతీష్ రావు, కార్తీక్ రావు, సురేష్ గౌడ్, అల్లం మహేష్ పాల్గొన్నారు.





