శేరిలింగంపల్లి, ఏప్రిల్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని TNGOS కాలనీలో నిర్వహించిన సైబరాబాద్ క్లీన్ స్వీప్ డ్రైవ్ (CCSD)లో భాగంగా శాసన మండలి తొలి చైర్మన్ స్వామి గౌడ్, డీసీ సేవా ఇస్లావత్, CMC అధికారులు, కాలనీ వాసులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో TNGOS కాలనీ మెగా క్లీన్ స్వీప్ డ్రైవ్ ను చేపట్టడం జరిగిందని, సైబరాబాద్ క్లీన్ స్వీప్ డ్రైవ్ (CCSD) ను ఏర్పాటు చేయడం జరిగిందని, కాలనీలో పేరుకుపోయిన చెత్తకుప్పలను తొలగించడం జరుగుతుందని తెలిపారు. చెత్త సేకరణ కోసం ఒక్కో విభాగానికి ఒక ఆటో లేదా టిప్పర్ నిమగ్నమై ఉంటుందని, కాలనీలలో పరిశుభ్రమైన వాతావరణం కల్పించే దిశగా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం అని అన్నారు. కాలనీలో పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో CMC అధికారులు, నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






