- కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్
మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): భారీ వర్షాల నేపథ్యంలో మాదాపూర్ డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ హెచ్చరించారు. మంగళవారం ఆయన మాదాపూర్ డివిజన్ పరిధిలోని నవభారత్ నగర్ బస్తీలో పర్యటించి వరదల కారణంగా నెలకొన్న పరిస్థితిని సమీక్షించారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. వర్షం కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమకు సమాచారం ఇవ్వాలని అన్నారు. బస్తీలో ఉన్న ప్రజలతో మాట్లాడి అవసరం ఉంటే సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలిస్తామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట సాదిక్, నూరుద్దీన్, అలీ, ప్రసాద్, వెంకటేష్, అమీర్, సిరాజ్, అఫ్రోజ్ తదితరులు ఉన్నారు.
