శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా ద‌ర్శ‌న‌మిచ్చిన లక్ష్మీ దేవి

చందాన‌గ‌ర్‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందాన‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలోని శిల్పా ఎన్‌క్లేవ్‌లో ఉన్న విశాఖ శ్రీ శారదా పీఠ పరిపాలిత శ్రీలక్ష్మీ గణపతి దేవాలయంలో దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు ఘ‌నంగా కొన‌సాగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం అమ్మ‌వారిని శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అవ‌తారంలో అలంకరించారు. అనంత‌రం అమ్మ‌వారికి పూజ‌లు, అభిషేకాలు నిర్వ‌హించారు. స్థానికులు, ప‌రిస‌ర ప్రాంతాల‌కు చెందిన భ‌క్తులు అమ్మ‌వారిని ద‌ర్శించుకుని తీర్థ ప్ర‌సాదాల‌ను స్వీక‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో వెంకట శ్యామ సుందర్, స్ర‌వంతి త‌దిత‌రులు పాల్గొన్నారు.

శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా ద‌ర్శ‌న‌మిస్తున్న ల‌క్ష్మీదేవి అమ్మ‌వారు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here