కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండనగర్, హనీఫ్ కాలనీల్లో డివిజన్ తెరాస కార్పొరేటర్ అభ్యర్థి హమీద్ పటేల్ తో కలిసి నూతనంగా ఏర్పాటు చేసిన తెరాస కార్యాలయాన్ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా తెరాస నాయకుడు మహేందర్ ఆధ్వర్యంలో సుమారుగా 200 మంది మార్వాడీలు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో వినోద్ గుప్తా, వినోద్ యాదవ్, చంద్రభాను, అనిరుద్ వర్మ, రింకు జైస్వాల్, శంషాద్ అలీ, విజయ్ వర్మ, హలీం, సంతోష్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్, శ్రీనివాస్ చౌదరి, తిరుపతి, బాబూమియా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ వంద సీట్లు సాధిస్తుందని అన్నారు. నగరంలోని అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని, ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా టీఆర్‌ఎస్‌కు ఓటేస్తామంటున్నారని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత పేదల బస్తీల్లో సౌకర్యాలు మెరుగుపడ్డాయని అన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసి టీఆర్‌ఎస్ ఓట్లడుగుతుందని అన్నారు. అందరూ తెరాసకు ఓటు వేయాలని కోరారు.







