కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన: అర్కల భరత్ కుమార్

గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ లో నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని ఆ పార్టీ డివిజన్ అభ్యర్థి అర్కల భరత్ కుమార్ అన్నారు. సోమవారం డివిజన్ పరిధిలోని నల్లగండ్లలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు స్థానిక నాయకులతో సమావేశమైన భరత్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు.

నల్లగండ్లలో కాంగ్రెస్ ప్రచారం లో భాగంగా స్థానిక నాయకుల మద్దతు కోరుతున్న భరత్ కుమార్

అనంతరం అయన మాట్లాడుతూ డివిజన్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారని, పలు కాలనీ సంక్షేమ సంఘాలు సైతం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడం ఖాయమని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సుమన్ గౌడ్, శ్రీను, బల్వంత్ రెడ్డి, మహేష్ లింగం, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రచారంలో భాగంగా మాజీ కార్పొరేటర్ ఆవుల సత్యరాయణ తో అర్కల పూర్ణిమ భరత్ కుమార్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here