శేరిలింగంపల్లి, మే 12 (నమస్తే శేరిలింగంపల్లి): GHMC ప్రధాన కార్యాలయంలో GHMC కమిషనర్ R.V కర్ణన్ ని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మర్యాదపూర్వకంగా కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని , అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని, అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అధిక మొత్తంలో నిధులు మంజూరు అయ్యేలా కృషి చేయాలని, పనులలో వేగం పెంచాలని అన్నారు. దీని పై GHMC కమిషనర్ R.V. కర్ణన్ సానుకూలంగా స్పందించారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని తెలియజేశారు. అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని అన్నారు.