శేరిలింగంపల్లి, మే 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ పేట్ డివిజన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ సందర్భంగా బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ మైనార్టీ మోర్చా నాయకుడు ఎండీ.సలీం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు బోయిని మహేష్ యాదవ్ హాజరై డాక్టర్లకు, నర్సులకు సన్మానం చేశారు. వైద్యరంగంలో కీలకమైన నర్సు వృత్తిని అంకిత భావంతో, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల ఆరోగ్య రక్షణలో సేవలందిస్తున్న నర్సులందరికీ కృతజ్ఞతలు తెలియజేసి వారికి అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. హాస్పిటల్ ను సందర్శించి పలు సమస్యలను గుర్తించి తాగునీటి, శానిటేషన్ సమస్యలను పరిష్కరించారు. మిగతా సమస్యలను కూడా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనూష, బీజేపీ జిల్లా నాయకులు బాబు రెడ్డి, పవన్, దేవేందర్ దాస్, రాజ్ దీప్ తదితరులు పాల్గొన్నారు.