నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ సర్కిల్ కార్యాలయంలో ఉప కమిషనర్ సుధాంషు నందగిరి అధ్యక్షత న ట్రేడ్ లైసెన్సు పన్నుల వసూళ్ల పై బుదవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందికి ఉపకమిషనర్ పలు సూచనలు చేశారు. ప్రతి వ్యాపారసంస్థ కు నోటీసు లు ఇచ్చి లైసెన్స్ ఫీజులు వసూలు చేయాలని, ఏ ఒక్క వ్యాపార సంస్థ లైసెన్స్ లేకుండా తమ వ్యాపారం నిర్వహించుకోకుండా అన్ని సంస్థలను ట్రేడ్ లైసెన్స్ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. లైసెన్స్ కలిగిన అన్ని వ్యాపార సంస్థలు విధిగా ఈ మార్చ్ 31 లోపు అపరాధ రుసుము లేకుండా తమ లైసెన్స్‌లను రెన్యువల్ చేసుకోవాలని, 1ఏప్రిల్ నుండి 30 మే వరకు 25% పెనాల్టీ విధించడం జరుగుతుందని, మే 31నుండి 50% పెనాల్టీతో లైసెన్సు ఫీజులు వసూలు చేయడం జరుగుతుందని తెలిపారు. లైసెన్సు తీసుకోని వారు వెంటనే సర్కిల్ కార్యాలయంలో సంప్రదించి, లైసెన్సు పొందాలని లేని యెడల అట్టి వ్యాపార సంస్థలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైద్యాధికారి KS రవి, పారిశుద్ధ్య అధికారి శ్రీనివాస్, SRP లు పాల్గొన్నారు.