నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల పండగ నిలిచిందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. శ్రావణ మాసం బోనాల పర్వదినం సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండ గ్రామంలో శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, శేరిలింగంపల్లి డివిజన్ పార్టీ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్,రవి యాదవ్, ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్ గౌడ్, ఉపాధ్యక్షులు రమేష్, కృష్ణ యాదవ్, వార్డ్ మెంబర్ పొడుగు రాంబాబు, వేణు, రమణయ్య , చైతన్య, నటరాజ్, పవన్ కుమార్, కొడిచెర్ల మహేష్, సురేష్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్ , మహేష్ యాదవ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.






