నమస్తే శేరిలింగంపల్లి: లింగంపల్లి గ్రామంలో శ్రావణ మాస బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పోచమ్మ టెంపుల్ యూత్ అసోసియేషన్ ఆద్వర్యంలో వేడుకలు వైభవంగా కొనసాగాయి. డప్పు దరువులు, పోతరాజుల విన్యాసలు, యువత కేరింతల నడుమ మహిళలు పెద్దమొత్తంలో అమ్మవారికి బోనాలు సమర్పించారు. భక్తులు తొట్టెల్లు ఊరేగించి అమ్మవారికి ముడుపులు చెల్లించుకున్నారు. గతేడాది కరోనా నేపథ్యంలో బోనాలు నిరాడంబరంగా జరుపుకోగా ఈ ఏడాది ఉత్సవాలు అంబరాన్నంటాయి. కరోనా పూర్తిస్థియిలో రూపుమాపి ప్రజలకు ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని పోచమ్మ దేవాలయ యూత్ సభ్యులు ఉదయ్ యాదవ్, హేమంత్, హరీష్ యాదవ్, ప్రణయ్, ఉదయకాంత్, మనోహర్ యాదవ్, పవన్, శరణ్, టిల్లూ, వినయ్ తదితరులు అమ్మవారిని వేడుకున్నారు.