శేరిలింగంపల్లి ప్రజల‌కు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ శుభాకాంక్షలు

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 14 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): 79 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల‌కు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ప్రజాభివృద్దే కేంద్ర బిందువుగా, ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా సీఎం రేవంత్ రెడ్డి సుపరిపాలన సాగిస్తున్నార‌ని అన్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు. ప్రతి సంక్షేమ పథకం పేదవారికి చేరినప్పుడే నిజమైన స్వాతంత్రం అని అన్నారు. ప్రభుత్వ పథకాలను తీసుకువచ్చే ముందు పేద ప్రజలను గుర్తుకు తెచ్చుకోవాలని మహాత్మాగాంధీ చెప్పార‌ని అన్నారు. యువత స్ఫూర్తిదాయకమైన ఆలోచనలతో , గొప్ప గొప్ప లక్ష్యాలతో ముందుకువచ్చి దేశ , రాష్ట్ర , ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here