శేరిలింగంపల్లి, ఆగస్టు 14 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు ఇబ్బందులను కలిగిస్తున్న హిజ్రాలకు స్థానిక పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. మియాపూర్ పరిధిలోని నాగులమ్మ దేవాలయంతోపాటు పలు పరిసర ప్రాంతాల్లో గృహ ప్రవేశం జరుగుతున్న ఇళ్ల వద్దకు లేదా పెళ్లిళ్లకు, ఇతర శుభ కార్యాలకు కొందరు హిజ్రాలు వెళ్లి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రజల నుంచి వారు బలవంతంగా డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే 5 మంది హిజ్రాలను అదుపులోకి తీసుకుని వారికి కౌన్సిలింగ్ ఇచ్చామని మియాపూర్ పోలీసులు తెలిపారు.






