ఆర్య వైశ్య సంఘం కార్తీక మాస వన భోజన కార్యక్రమంలో పాల్గొన్న PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో ఆర్య వైశ్య సంఘం మయూరి నగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మాస వన భోజన మహోత్సవం కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, ఆర్యవైశ్య సంఘం సభ్యులతో కలిసి PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన కార్తీక మాసం సందర్బంగా ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వన భోజన మహోత్సవం కార్యక్రమంను నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. ఇది ఒక శుభపరిణామం అని, ఆర్య వైశ్య సంఘం సభ్యులు ఐక్యతగా ఉండాల‌ని అన్నారు. ఆర్య వైశ్య సంఘం సభ్యులు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు, సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here