శేరిలింగంపల్లి, మార్చి 4 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా ప్రజావాణి కార్యక్రమం కొనసాగింది. జోనల్ కార్యాలయంతోపాటు శేరిలింగంపల్లి , చందానగర్ , యూసుఫ్ గూడా , పటాన్ చెరు సర్కిళ్లలో అధికారులు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. మొత్తం 22 వినతులు అధికారులకు అందాయి .ఇందులో జోనల్ కార్యాలయంలో 3, శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో 12, యూసఫ్ గూడ సర్కిల్ కార్యాలయంలో 4 ,చందానగర్ సర్కిల్ కార్యాలయంలో 3 చొప్పున వినతులు వచ్చాయి. ఇందులో పట్టణ ప్రణాళిక, పన్ను విభాగం, ఇంజనీరింగ్ కు సంబంధించి సమస్యలను ప్రజలు వినతిపత్రం రూపంలో అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన వినతులపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు .అత్యంత ప్రాధాన్యతగా భావించి క్షేత్రస్థాయి పరిశీలనలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి తీసుకున్న చర్యలను తిరిగి ప్రజలకు నివేదించాలని జోనల్ కమిషనర్ సూచించారు. చందానగర్ సర్కి కార్యాలయంలో డిసి మోహన్ రెడ్డి ఆయా విభాగాల అధికారులతో ప్రజావాణిలో వినతులను స్వీకరించారు.