శేరిలింగంపల్లి, మార్చి 4 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆర్యవైశ్య సంఘం మాదాపూర్ నూతన కార్యాలయంను మాదాపూర్ డివిజన్ సీనియర్ నాయకుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం మాదాపూర్ నూతన కార్యాలయంను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, చిన్న చిన్న సమావేశాలు పెట్టుకోవడానికి ఎంతగానో తోడ్పడుతుందని, సంఘము సమావేశాలు, కుటుంబ సభ్యులతో కలిసి చర్చించుకోవడానికి అన్ని హంగులతో సకల సౌకర్యాలతో సంఘం కార్యలయంను నిర్మించుకోవడం అభినందనీయం అని అన్నారు.
వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని, ఏ చిన్న సమస్య తన దృష్టికి తీసుకువచ్చిన పరిష్కరిస్తానని , ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మామిడల రాజు, ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ కొక్కల్ల బాల్ రాజు గుప్తా, జనరల్ సెక్రటరీ కొండూరు మురళి గుప్తా , కోశాధికారి దొడ్ల సుధాకర్ గుప్తా , మండల మాజీ ప్రెసిడెంట్ గోలి రాజు, లింగం గుప్తా, శ్రీనివాస్ గుప్తా, బద్దం భాస్కర్ గుప్తా, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.