ఉచిత వైద్య శిబిరాల‌ను నిర్వ‌హించ‌డం అభినంద‌నీయం: పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జూన్ 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రగతి ఎన్‌క్లేవ్ కాలనీలో ఉన్న ఆర్‌వీ అవనీంద్ర గేటెడ్ కమ్యూనిటీలో సీనియర్ నాయకుడు డీఎస్‌ఆర్‌కే ప్రసాద్ ఆధ్వర్యంలోని ప్రసాద్ ఫౌండేషన్, మెడికవర్ హాస్పిటల్స్ సహకారంతో నిర్వహించిన 18వ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ప్రసాద్ ఫౌండేషన్ అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. డీఎస్‌ఆర్‌కే ప్రసాద్ నాయకత్వంలో ఇప్పటికే 18 మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం గొప్ప విషయమని, ఈ శిబిరాలు పరిసర ప్రాంతాల పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయని అన్నారు. ప్రస్తుతం ప్రజలు తమ రోజువారీ జీవితంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, అలాంటి పరిస్థితుల్లో ఉచిత వైద్య శిబిరాలు ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించేందుకు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరమని సూచించారు.

శిబిరంలో 2డి ఈకో, క్యాన్సర్ స్క్రీనింగ్, ఈసీజీ, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్, డెర్మటాలజీ, నేత్ర, దంత, న్యూరాలజీ, ఈఎన్‌టీ తదితర విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు సేవలు అందించారు. ఉచిత వైద్య పరీక్షలతోపాటు మందులను కూడా పంపిణీ చేశారు. ఈ మెగా వైద్య శిబిరంలో 18 రకాల రక్త పరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలు, గైనకాలజీ, ఆర్థో, ఈసీజీ, ఈఎన్‌టీ, దంత, నేత్ర పరీక్షలు, ఎక్స్‌రే సేవలు అందించడంతోపాటు అర్హులైన వారికి ఉచిత కళ్లజోళ్లు, ఉచిత మందుల పంపిణీ కూడా చేపట్టారు. ఆరోగ్యం వ్యాపారంగా మారుతున్న ప్రస్తుత కాలంలో సామాజిక బాధ్యతతో ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని గాంధీ పేర్కొన్నారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు. ఈ సందర్భంగా శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులు, వైద్య బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. అలాగే సీజనల్ వ్యాధులు రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రసాద్ ఫౌండేషన్ చైర్మన్ డీఎస్‌ఆర్‌కే ప్రసాద్, డైరెక్టర్ రమాదేవి, డైరెక్టర్, చీఫ్ కోఆర్డినేటర్ లీలా ప్రసాద్, ఫౌండేషన్ సభ్యులు వినోద్, ఎంఆర్‌కే చౌదరి, శ్రీకాంత్, శ్రీను చౌదరి, బాలు, చిన్నా, పెద్దబాబు, బాషా, రవి, తులసి, యశ్వంత్, సుబ్బారావు, శ్రీనివాస్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆర్‌వీ అవనీంద్ర అసోసియేషన్ సభ్యులు సంపత్, పీవీ చంద్రశేఖర్, బాలాజీ నారాయణ, నవీన్ కుమార్, డి. శివకోటేశ్వరరావు, ఎం. పార్థసారథి, లా గార్డేనియా అపార్ట్‌మెంట్ సభ్యులు ప్రసాద్, ప్రవీణ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here