శేరిలింగంపల్లి, మార్చి 28 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ బాపునగర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 99 రోజులు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిభిరాన్ని పీఏసీ ఛైర్మన్, శాసనసభ్యుడు ఆరెకపూడి గాంధీతో కలిసి శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రత్యేక వైద్య నిపుణుల ఉచిత ఆరోగ్య శిబిరంలో స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణుల చికిత్స శిబిరం (నేత్ర, దంత, ఎముకల, జనరల్ ఫిజిషియన్) సేవలు అందిస్తున్నారని.. ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైద్య శిబిరానికి వచ్చిన రోగులను పేరు పేరున పలకరించి వారి ఆరోగ్య పరిస్థితులను ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ ఉమా దీపిక, డాక్టర్ రాకేష్, డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, సీనియర్ నాయకులు యాదా గౌడ్, రఘునాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, గఫుర్, బాపునగర్ హనుమాన్ యూత్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, పద్మారావు, డి శ్రీకాంత్, గోపినగర్ అంబేద్కర్ భవన్ ప్రెసిడెంట్ రమేష్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్, నర్సింహా, ప్రవీణ్, పవన్, సత్యనారాయణ, సందీప్, మహేందర్ సింగ్, శశాంక్, ముంతాజ్ బేగం, సాయి, రాజేష్, సాయికిరణ్, వైద్య సిబ్బంది, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.






