నమస్తే శేరిలింగంపల్లి: ఆరోగ్యం పట్ల ప్రజల్లో శ్రద్ధ పెరిగిందని, వ్యాయామం చేసి శారీరక దారుఢ్యాన్ని మెరుగుపరుచుకోవడం సంతోషకరమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని గౌతమి ఎన్ క్లేవ్ లోని స్పోర్ట్స్ గ్రౌండ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్కులలో పచ్చని చెట్ల మధ్య జీహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తున్న ఓపెన్ జిమ్ లకు ప్రజలలో మంచి ఆదరణ లభిస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో మన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మరిన్ని ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేసి, ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందించే దిశగా అన్ని చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు.

ప్రస్తుత జీవన విధానంలో ప్రతి ఒక్కరూ విధిగా వ్యాయామలు చేయడం అవసరమని, ఆరోగ్యం బాగుంటే మనిషి ఏదైనా సాధించగలడని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్, జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, సెక్రటరీ బలరాం యాదవ్, సీనియర్ నాయకులు రక్తపు జంగంగౌడ్, రాజా రాజేశ్వరి కాలనీ ప్రెసిడెంట్ విజయకృష్ణ, ఐలేష్ యాదవ్, కీత్ బొందలపాటి, గౌతమి ఎన్ క్లేవ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణ మోహన్ రెడ్డి, సెక్రటరీ చైతన్య, జాయింట్ సెక్రటరీ కిరణ్ కుమార్, ట్రెజరర్ శ్రీరామ్ రెడ్డి, ఎక్జిక్యూటివ్ మెంబర్స్ పాల్గొన్నారు.
