బీసీలకు న్యాయం చేయగల శక్తి ఒక్క కాంగ్రెస్‌కే ఉంది: టీపీసీసీ కార్యదర్శి సామల్ కార్తీక్

శేరిలింగంపల్లి, అక్టోబర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): బీసీ కులాల హక్కుల సాధన కోసం చేపట్టిన బంద్‌కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింద‌ని, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్ సరైనదే కాకుండా సమాజానికి సమానత్వం తీసుకువచ్చే అడుగుగా భావిస్తున్నామని కంటెస్ట్ కార్పొరేటర్ సామెల్ కార్తీక్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో వర్గాలు తమ హక్కుల కోసం పోరాడినా, నిజమైన న్యాయం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మొదలైందని ఆయన గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ కుల గణన చేపట్టి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదింపజేశారు. ఇది బీసీల హక్కులను చట్టపరంగా గుర్తించిన చారిత్రాత్మక నిర్ణయం అని ఉద్ఘాటించారు.

అయితే ఆ తీర్మానం గవర్నర్, రాష్ట్రపతికి పంపిన తర్వాత కూడా ఆమోదం ఇవ్వకపోవడం బీసీలకు పెద్ద అన్యాయం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు బీసీల పట్ల ప్రేమ ఉన్నట్టు నటిస్తున్న వారు వాస్తవానికి కపట ప్రేమ చూపిస్తున్నారు. కానీ బీసీలకు నిజమైన మద్దతు, నిజమైన న్యాయం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వడం ఖాయం. పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో ఎప్పుడూ వెనకడుగు వేయదు అని స్పష్టం చేశారు. అలాగే బీసీ సమాజం ఈ బంద్‌ను శాంతియుతంగా నిర్వహించి తమ హక్కులను సాధించుకునే దిశగా ఒక్కటిగా ముందుకు వచ్చారని, ఇది కేవలం బంద్ కాదు, బీసీ సమాజ గౌరవాన్ని కాపాడుకునే ఉద్యమం. సమాజంలో సమానత్వం కోసం, మన భవిష్యత్తు తరాలకు గౌరవప్రదమైన స్థానం కల్పించుకోవడానికి ఈ పోరాటం అవసరం అని ఆయన పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here