శేరిలింగంపల్లి, అక్టోబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): 42% బీసీ రిజర్వేషన్ కు మద్దతుగా కొనసాతున్న రాష్ట్ర బంద్‌కు యం సి పి ఐ (యు ) సంపూర్ణ మద్దతు తెలుపుతుందని పార్టీ మియాపూర్ డివిజన్ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ తెలిపారు. మియాపూర్ డివిజన్ స్టాలిన్ నగర్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన జనాభా లెక్కల సర్వేలో రాష్ట్రంలో బీసీల జనాభా ఎక్కువ తేలడం జరిగిందని, దాని ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించగా కొందరు బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులు కోర్టు ద్వారా నిలిపివేశారు అని అన్నారు. బీసీల రిజర్వేషన్ సాధించేవరకు బీసీ వర్గాలు చేసే ఉద్యమానికి తమ పార్టీ పూర్తిస్థాయిలో సంపూర్ణ మద్దతు ఉంటుందని, బంద్ లో మేధావులు, విద్యార్థులు, అన్ని వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.






