హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): నగరంలోని సుల్తాన్ బజార్లో ఉన్న కేఎస్ లేన్ హనుమాన్ వ్యాయామ శాలలో ఆదివారం ఉదయం 6 నుంచి 7.30 గంటల వరకు హఠ యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నమస్తే యోగా ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. యోగాచార్య బృజ్భూషణ్ పురోహిత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. ఇందులో భాగంగా జలనేతి, సూత్రనేతి తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. అందువల్ల ఈ కార్యక్రమంలో ఆసక్తి ఉన్నవారు పాల్గొనవచ్చని తెలిపారు. ఆన్ లైన్లో https://meet.google.com/hme-avrp-xpo అనే గూగుల్ మీట్ లింక్‌ను సందర్శించి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని సూచించారు. ఇందులో పాల్గొనదలచిన వారు కార్యక్రమానికి అవసరం అయ్యే 10 గ్లాసుల గోరు వెచ్చని నీరు, ఇతర అవసరమైన సామగ్రిని వెంట ఉంచుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8886665690/91, 998506321 అనే నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.






