శిల్పారామంలో అలరించిన భ‌ర‌త‌నాట్య ప్ర‌ద‌ర్శ‌న

మాదాపూర్ (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): వారాంత‌పు సాంస్కృతిక కార్య‌క్ర‌మాల్లో భాగంగా మాదాపూర్‌లోని శిల్పారామంలో శ‌నివారం నృత్యం డ్యాన్స్ అకాడ‌మీ ప్ర‌ద‌ర్శించిన భ‌ర‌త నాట్యం, దేశ‌భ‌క్తి పాట‌ల నృత్యాలు సంద‌ర్శ‌కుల‌ను అల‌రించాయి. సుచిస్మిత శిష్య బృందం గురు వందన, విష్ణు శ్లోకం, నటేశ కౌతం అలరిపు, జతిస్వరం, గణేశా కీర్తన, కళింగ నర్తన తిల్లాన త‌దిత‌ర అంశాల్లో భ‌ర‌త నాట్యాన్ని ప్ర‌ద‌ర్శించ‌గా, వందేమాతరం, తేరి పుకారు సి, సమరస భావన, ఎహ్ మేరేయ్ వతన్ కె లోగోం, జై హింద్, మిలెయ్ సురమేరా తుమరా త‌దిత‌ర అంశాల్లో దేశ‌భ‌క్తి పాట‌ల‌ను శ్రేయసీ దాస్, సుధారీతి దాస్, అహనా, అశ్విక, వీరింద వినీషే త‌దిత‌రులు ప్రదర్శించి ఆక‌ట్టుకున్నారు.

భ‌ర‌త‌నాట్య ప్ర‌ద‌ర్శ‌న‌తో అల‌రిస్తున్న క‌ళాకారులు
దేశ‌భ‌క్తి గీతాల‌కు నృత్యాలు చేస్తున్న క‌ళాకారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here