శేరిలింగంప‌ల్లిలో కొన‌సాగుతున్న స‌మ‌గ్ర కుల‌గ‌ణ‌న

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 11 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో భాగంగా శేరిలింగంపల్లి జోన్‌లో వివిధ ప్రాంతాల్లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో కుటుంబాల వారీగా వివరాల సేకరణకు సూపర్వైజ‌ర్లు, ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన ఎన్యూమరేటర్ బ్లాక్ లలో సర్వే కొనసాగిస్తున్నారు. జోన్ పరిధి లోని నల్లగండ్ల, డోయెన్స్ కాలనీ, చందానగర్, శాంతినగర్ ప్రాంతాలలో మానిటరింగ్ ఆఫీసర్ మయాంక్ మిట్టల్, సర్కిల్ డిప్యూటీ కమీషనర్లు పి. మోహన్ రెడ్డి, ముకుంద రెడ్డి, ఇతర ఆఫీస్ సిబ్బంది పర్యటించారు. అలాగే మానిటరింగ్ ఆఫీసర్ మయాంక్ మిట్టల్, సూపర్వైజర్స్ ఎన్యూమరేటర్ బ్లాక్ లను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

అధికారులను అడిగి వివ‌రాల‌ను తెలుసుకుంటున్న మానిట‌రింగ్ ఆఫీస‌ర్ మ‌యాంక్ మిట్ట‌ల్

మయాంక్ మిట్టల్ మాట్లాడుతూ.. ఈ కుటుంబ సర్వేలో భాగంగా ప్రతి ఎన్యుమరెటర్ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల‌ను జాగ్రత్తగా మార్గదర్శక పుస్తకంలో సూచించిన ప్రకారం పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని ఆదేశించారు. జోనల్ కమీషనర్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి రోజు సంబంధిత నాలుగు వార్డుల ఇంచార్జిలు, సూపర్వైజ‌ర్లు పది శాతం ఎన్యూమరేటర్ల నమోదును క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి ఎన్యుమరేటర్లకు తగు మార్గదర్శకత్వం చేయాలని ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు, కాలనీ సంఘాలు మొదలైన వారు సర్వే సిబ్బందికి సహకరించి సమాచారం ఇవ్వాలని జోనల్ కమీషనర్ ఈ సందర్బంగా కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉష, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here