శేరిలింగంపల్లి, నవంబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే లో భాగంగా చందానగర్ సర్కిల్ లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో కుటుంబాల వారీగా వివరాల సేకరణకు సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన ఎన్యూమరేటర్ బ్లాక్ లలో సర్వే కొనసాగిస్తున్నారు. సర్కిల్ పరిధి లోని చందానగర్ వార్డ్ లో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి నివాసంలో సర్కిల్ పర్యవేక్షకుడు మయాంక్ మిట్టల్, శేరిలింగంపల్లి జోనల్ కమీషనర్ ఊపేందర్ రెడ్డి, సర్కిల్ డిప్యూటీ కమీషనర్ పి. మోహన్ రెడ్డి ఎన్యూమరేటర్ బ్లాక్ లను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ప్రాజెక్టు అధికారిణి ఉషా రాణి, ఏఎంసిలు విజయ్ కుమార్, కృష్ణ పాల్గొన్నారు.