శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్లలో మళయాళీ అసోషియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మానస్ 2025 ఓనం పర్వదిన వేడుకలలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఓనం పర్వదినం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, ఓనం పర్వదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని , చాలా పవిత్రమైన పర్వదినం అని PAC చైర్మన్ గాంధీ తెలియజేశారు. అన్ని వేళళ్లో ప్రజలకు అండగా ఉంటానని, ప్రజల అభ్యున్నతికి ఎల్లవేళలా కృషి చేస్తానని, తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంత్రిప్రగడ సత్యనారాయణ, విష్ణు వర్ధన్ రెడ్డి, వేణు గోపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, హరిదాస్ మనికొత్, KR జయనారాయణ్, అతుల్ నాథ్, KP విశాల్, ప్రియ కే.ప్రసాద్, లక్ష్మీ, అదితి ఆనంద్, రాధిక వివేక్ తదితరులు పాల్గొన్నారు.






