శేరిలింగంపల్లి, జనవరి 17 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ఓంకార్ నగర్ బస్తీ వాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై మియాపూర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉప్పలపాటి శ్రీకాంత్ ని మర్యాదపూర్వకంగా కలసి వినతి పత్రం ఇచ్చారు. దీనిపై కార్పొరేటర్ శ్రీకాంత్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. మియాపూర్ డివిజన్ పరిధిలోని ఓంకార్ నగర్ బస్తీ వాసులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, PAC ఛైర్మెన్ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో బస్తీలో నెలకొన్న వివిధ సమస్యలను దశలవారిగా పరిష్కరిస్తామని, ఓంకార్ నగర్ బస్తీలో మంజీర మంచినీటి వసతిని మెరుగుపరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రతనకర్, భాషా శివ , సురేష్ కుమార్ జంగయ్య, ఖాదర్ వల్లి,పెంటయ్య ,కిషన్ ,జనార్ధన్,సురేష్ ,మత్తయ్య ,ఎల్లప్ప , సిద్దు , ముగిలేష్, సిహెచ్ ప్రభాస్, సంపత్, ప్రభాస్,అఖిల్,భాస్కర్,సమ్మయ్య,యాదగిరి,సంతోష్ కుమార్, రవి,చోటారాం తదితరులు పాల్గొన్నారు.
