చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ లో కొనసాగుతున్న నాలా విస్తరణ పనులను HMWS&SB, R&B, GHMC అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. మంచి నీటి పైప్ లైన్ ను పునరుద్ధరించి పనులను సులభతరం చేయాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సమస్యను పరిష్కరించుకొని కల్వర్ట్ నిర్మాణ పనులను త్వరితగతిన జరిగేలా చూడాలని అన్నారు.
ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని, పనులలో జాప్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కరోనా వంటి విపతర్క పరిస్ధితుల్లోనూ అభివృద్ధి, సంక్షేమం ఆగకూడదనే ఉదేశ్యంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నాలా విస్తరణ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో రాజీ పడకుడదని, పనులలో వేగం పెంచాలని సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. నాలా నిర్మాణ పనులపై ఆయన పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో GHMC DE రూపాదేవి, AE అనురాగ్, R & B DE రామకృష్ణ, మియపూర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.