శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): భారీ వర్షం కారణంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్ మోహర్ పార్క్ కాలనీలో ముంపు ప్రాంతాలలో కలిగే సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ముంపుకు గురయ్యే లోతట్టు ప్రాంతాల్లో పలు శాఖల సంబంధిత అధికారులతో కలసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పర్యటించి, పరిశీలించి, సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ వర్షాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతాల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని , GHMC అధికారులు, మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ , డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని , ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని , ప్రజలు అభద్రత కు లోను కాకుండా ధైర్యంగా ఉండాలని అన్నారు. వర్షాలు పడుతున్న సమయంలో ఇంటి నుండి బయటకి రాకుండా ఉండాలని తప్పని పరిస్థితుల్లో బయటకి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో GHMC అధికారులు EE శిరీష, DE ఆనంద్, AE భాస్కర్, AE రషీద్, మాజీ వైస్ చైర్మన్ సుబ్బారావు, కాలనీ ప్రెసిడెంట్ ఖాసీం, నాయకులు గణేష్ ముదిరాజు, మారబోయిన రాజు యాదవ్, , మల్లేష్ యాదవ్, మల్లేష్ గౌడ్, కొడిచెర్ల రాములు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






