అంగ‌న్ వాడీ కేంద్రాలతో చిన్నారుల‌కు పోష‌ణ‌, విద్యాభివృద్ధి

శేరిలింగంప‌ల్లి, జూన్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పిల్ల‌ల‌కు ఆట‌పాట‌ల‌తోపాటు చ‌క్క‌ని విద్య, సృజ‌నాత్మ‌క‌త‌ను వెలికితీయ‌డంలో అంగ‌న్ వాడీ కేంద్రాలు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని ఐసీడీఎస్ శేరిలింగంప‌ల్లి ప్రాజెక్టు ఆదిత్య‌న‌గ‌ర్ సెక్టార్ సూప‌ర్ వైజ‌ర్ లోవ కుమారి అన్నారు. బుధ‌వారం అమ్మ‌మాట – అంగ‌న్ వాడీ బాట కార్య‌క్ర‌మంలో భాగంగా మార్తాండ‌న‌గ‌ర్ అంగ‌న్ వాడీ కేంద్రం-3లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఆమె పాల్గొని చిన్నారుల‌కు అక్ష‌రాభ్యాసం చేయించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ రెండున్న‌ర సంవ‌త్స‌రాలు దాటిన చిన్నా,రుల‌ను అంగ‌న్ వాడీలో చేర్పించాల‌ని కోరారు. ఈ సంవ‌త్స‌రంలో చేరే చిన్నారుల‌కు బ్రేక్ ఫాస్ట్‌తోపాటు యూనిఫామ్స్ అంద‌జేయ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో అంగ‌న్ వాడీ టీచ‌ర్ ఎం.ల‌క్ష్మీప్ర‌వీణ‌, స‌హాయ‌కురాలు జులేక‌, కాల‌నీవాసులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here