శేరిలింగంపల్లి, జనవరి 18 (నమస్తే శేరిలింగంపల్లి): న్యూ హఫీజ్‌పేట సుభాష్ చంద్రబోస్ నగర్‌లో టీడీపీ సీనియర్ నాయకుడు ఆరేపల్లి సాంబశివ గౌడ్ ఆధ్వర్యంలో నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ చేవెళ్ల పార్లమెంటరీ కన్వీనర్ కట్ట వెంకటేష్ గౌడ్, నాయకులు బీఎస్ఎన్ కిశోర్ యాదవ్, మధు, పోలీనాబ్బారావు, గౌతమ్, ఎండీ మోసం ఖాన్, అమీర్, ఎల్.నరసింహారావు, ఎండీ లతీఫ్, సాబిర్ హుస్సేన్, ప్రభాకర్, శేఖర్ పాల్గొన్నారు.






