ఎంత ఎదిగినా సంస్కృతి, సంప్రదాయాలను మరవొద్దు: మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ గోపన్‌పల్లి తండా బంజారా గ్రౌండ్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ సమ్మేళనం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రహ్మశ్రీ డా. బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి హాజరై సభను ఉద్దేశించి మాట్లాడుతూ హిందూ సంప్రదాయాలు, ఆచారాలు, సాంస్కృతిక విలువల గొప్పతనాన్ని విష‌దీకరించి, సమాజంలో వాటి ప్రాధాన్యతను ప్రతిపాదించారు. ప్రస్తుత కాలంలో యువత ఈ సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని కూడా వివరించారు.

తన ప్రసంగంలో సనాతన ధర్మం ప్రాముఖ్యతను వివరించారు. సనాతన ధర్మం కేవలం ఒక మతం మాత్రమే కాకుండా సంపూర్ణ జీవన విధానం అని, అది సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలను కాపాడే పునాదిగా నిలుస్తుందని తెలిపారు. హిందూ ధర్మంలో ఉన్న సహన భావం, పరస్పర గౌరవం, ప్రకృతి పట్ల కృతజ్ఞత వంటి గొప్ప విలువలను యువత అవగాహన చేసుకుని ఆచరించాలని పిలుపునిచ్చారు. కుటుంబ వ్యవస్థ, గురు-శిష్య పరంపర, పండుగలు, సంప్రదాయ ఆచారాలు సమాజాన్ని బలంగా నిలబెట్టే ముఖ్యమైన ఆధారాలు అని ఆయన స్పష్టం చేశారు. మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ఎంత ఎదిగినా సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోవద్దని, నేటి యువత ఆధునికతను అందిపుచ్చుకుంటూ సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు తెలియజేయాలన్నారు. రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తన శతాబ్ది ఉత్సవాల (100 ఏళ్లు) సందర్భంగా దేశవ్యాప్తంగా దాదాపు ఒక లక్షకు పైగా హిందూ సమ్మేళనాలను నిర్వహిస్తోంద‌ని అన్నారు. హిందూ సమాజంలోని కుల వివక్షను తొలగించి, అందరినీ ఏకం చేయడం దీని ప్రధాన లక్ష్యమ‌ని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here