శేరిలింగంపల్లి, మార్చి 30 (నమస్తే శేరిలింగంపల్లి): రంజన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఆదిత్య నగర్ ఈద్గా వద్ద ముస్లింలు నిర్వహించే ప్రార్థనలకు చేపట్టిన అన్ని ఏర్పాట్లను శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు. మసీదుల పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, చెత్త, తదితర వ్యర్థాలను ప్రతిరోజు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని శానిటేషన్ సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశించారు. మసీదులకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా చూడాలని, అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ ల ద్వారా నీటి సరఫరాకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు శివ గౌడ్, సాజిద్, డివిజన్ అధ్యక్షుడు నగేష్ నాయక్, బస్తి నాయకులు మునాఫ్ ఖాన్, రహీం, ముక్తార్, అఖిల్, హనీఫ్, ఇస్మాయిల్, లతీఫ్, సాహెల్, ఇమ్రాన్, హామీద, రీజ్వన్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.