శేరిలింగంపల్లి, మార్చి 30 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమాచార్య భావనా వాహిని వ్యవస్థాపక అధ్యక్షురాలు డా. శోభా రాజు ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా గీతా వాహిని శిష్యులు భగవద్గీత పారాయణం చేశారు. అనంతరం పెద్దింటి వెంకట భాస్కర సత్యనారాయణా చార్యులుచే పంచాంగ శ్రవణం చేశారు. అన్ని రాశుల వారి రాశి ఫలాలను, విచ్చేసిన వారందరికీ అర్థమయ్యే రీతిలో తెలిపారు. శోభా రాజు మాట్లాడుతూ అన్ని రాశుల వారు ఒక్క దైవ చింతన కలిగి ఉంటే అంతా మంచే జరుగుతుంది అని తెలిపారు. చివరిగా పంచాంగ శ్రవణం, భగవద్గీత పారాయణం చేసిన చిన్నారులకు డా. శోభా రాజు, మేనేజింగ్ ట్రస్టీ డా. నంద కూమార్ సంస్థ జ్ఞాపికలను ఇచ్చి గౌరవించారు. శ్రీ అన్నమాచార్య సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మంగళ హారతి, విచ్చేసిన వారందరికీ చక్కటి సాంప్రదాయ పద్ధతిలో ప్రసాదాన్ని పంచిపెట్టి కార్యక్రమాన్ని ముగించారు.