నమస్తే శేరిలింగంపల్లి: అగ్ని(వహ్ని) కుల క్షత్రీయ సేవాసంస్థాన్, పల్లవ A1 రీసెర్చ్ ఫౌండేషన్, శ్రీరామకృష్ణ వివేకానంద సేవా సమితిల ఆధ్వర్యంలో మియాపూర్ ప్రగతీ ఎన్‌క్లేవ్‌లోని శ్రీమాశారదా ధ్యానమందిరంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిరుపేద మెరిట్ విద్యార్థినులకు ప్రొఫెసర్ చంద్రశేఖరయ్య ఉపకార వేతనాలను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7 జిల్లా పరిషత్ పాఠశాలలకు చెందిన 30 మంది విద్యార్థులు లక్ష్యంగా ఉపకారవేతనాల వితరణ జరుగుతుందని తెలిపారు. కరోనా కాలంలో ఒడిదుడుకులకు లోనై వేతనాలు పొందని వారికి ఇప్పుడు అందజేస్తున్నట్టు తెలిపారు. అనంతరం ద్యానమందిరం ఆవరణలో విద్యార్థినిలు పూల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ పెద్దిరాజు, పల్లవ A1 రీసెర్చ్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
