నిరాశ్రయులకు ఆశ్రయం‌ కల్పించేందుకు నైట్ షెల్టర్ దోహదం – కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నైట్ షెల్టర్ హోమ్ నిరాశ్రయులకు స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జీహెచ్ఎంసీ అధికారులతో‌ కలిసి పలువురు దాతల సహకారంతో ఫ్రూట్స్, స్వీట్లు, బ్లాంకెట్స్, నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ నగరంలోని నిరాశ్రయులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్జీఓ‌ స్వచ్ఛంద సంస్థల ద్వారా నైట్ షెల్టర్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అర్హులైన వారు బూస్టర్ డోస్ వేసుకునేలా ఈ ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.‌ ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ వెంకన్న, డాక్టర్ ఏఎంఓహెవ్ నాగేష్, అర్బన్ డెవలప్‌మెంట్ కమ్యూనిటీ ఆఫీసర్ మన్వి, శాంటేషన్ సూపర్ వైజర్ జలేంధర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, గోపాల్ యాదవ్, ఎస్ఆర్పి బాలరాజ్, ప్రైమరీ హెల్త్ సెంటర్ సిబ్బంది, ఎస్ఎఫ్ఏ లు, అర్బన్ డెవలప్‌మెంట్ కమ్యూనిటీ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నైట్ షెల్టర్ లో నిత్యావసర సరుకులను అందజేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here