నమస్తే శేరిలింగంపల్లి: వృద్ధులకు సేవ చేయడం దేవునికి సేవ చేయడం లాంటిందని తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ కరణ్ పేర్కొన్నారు.75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవం, శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా హుడా హెచ్ఐజీలోని శ్రీ సాయి సేవా నిలయం ట్రస్ట్ లో నిర్వాహకులు అల్లం పాండురంగారావుతో కలిసి మున్సిపల్ కమిషనర్ కరణ్ వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరణ్ మాట్లాడుతూ వృద్ధులకు సేవ చేసేందుకు అల్లం పాండురంగారావు వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.