ఎమ్మెల్సీ క‌విత జ‌న్మ‌దినం సంద‌ర్భంగా రోగుల‌కు పండ్లు పంపిణీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో తెలంగాణ జాగృతి, ఎంపీ రంజిత్ అన్న యువ‌సేన ఆద్వ‌ర్యంలో శ‌నివారం పండ్లను చేశారు. ప్ర‌ముఖ జోతిష్యులు విశ్వ‌నాథుల చంద్ర‌శేఖ‌‌ర శాస్త్రీ ముఖ్య అతిథిగా హాజ‌రై రోగుల‌కు పండ్లు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఎమ్మెల్సీ క‌విత భ‌విష్య‌త్తులో మ‌రిన్ని ఉన్న‌త ప‌ద‌వులు అధిరోహిస్తార‌ని ఆశీర్వ‌దించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్య‌ద‌ర్శి నితీష్, ఎంపీ రంజిత్ అన్న యువసేన అధ్య‌క్షులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆశిల శివ, జాగృతి నాయకులు శశిధర్, సాయి, కృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రోగుల‌కు పండ్లు పంపిణీ చేస్తున్న చంద్ర‌శేఖ‌ర శాస్త్రీ, నితీష్‌, ఆశిల శివ‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here