శేరిలింగంపల్లి, డిసెంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): పూడూరు మండలంలోని సిరిగాయపళ్లి గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ గా ఎన్నికైన అంబటి రాజు యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా తెలంగాణా రాష్ట్ర బీసీ ఐక్యవేదిక భేరి రాంచందర్ యాదవ్ అంబటి రాజు యాదవ్ ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భేరీ రాంచందర్ యాదవ్ మాట్లాడుతూ బీసీలు పెద్ద ఎత్తున అన్ని రంగాలో పాల్గొనాలని తెలిపారు. అదే విధంగా రాజకీయంగా బీసీలు అయిన యాదవులు ఉన్నత స్థానాలలో నిలబడాలని కోరారు. యాదవులు, బీసీలు ఐక్యమై రాజ్యాధికారం కోసం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయ రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో సిరిగాయపల్లి నూతన వార్డు మెంబర్లుగా ఎన్నికైన పెద్దిని నర్సింహులు యాదవ్, గంగ్యడ దాసు యాదవ్, గొర్ల రాఘవేందర్ యాదవ్, ఇటికెని నర్సింహులు యాదవ్ పాల్గొన్నారు.






