శేరిలింగంపల్లి, డిసెంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ సాయి నగర్ బస్తీ లోని అంగన్వాడీ కేంద్రం ఉన్న స్థలంలో ప్రహరీ గోడ తో నూతన భవనం నిర్మాణం చేయాలని కోరుతూ రాజేంద్రనగర్ లోని రంగారెడ్డి జిల్లా CDPO జ్యోతిని హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా కైతాపురం జితేందర్ మాట్లాడుతూ సాయినగర్ బస్తీలో అంగన్వాడీ కేంద్రంను తప్పక సందర్శించాలని అన్నారు. కిర్బీ షీట్లతో రూమ్ ఏర్పాటు చేశారని, రూములో కరెంట్ వసతి లేక , వాష్ రూమ్ లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారని, అంగన్వాడీ కేంద్రం ఎదుట మస్కా కుంట చెరువు ఉండడం, ప్రహరీ గోడ లేక పోవడం వల్ల ప్రమాదకరంగా ఉన్నదని అన్నారు. అక్కడ కనీస వసతులు లేక చాలా ఇబ్బందిగా ఉంటున్నారని తెలిపారు. కనుక అంగన్వాడీ కేంద్రం ఉన్న స్థలాన్ని ప్రభుత్వం ప్రహరీ గోడతో నూతన భవనం నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ మాజీ అధికార ప్రతినిధి అజిత్ సేనాపతి , బీజేపీ జిల్లా గీతా సెల్ కన్వీనర్ రవి గౌడ్ , హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి జగన్ గౌడ్, డివిజన్ బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్ , బీజేపీ నాయకులు కార్తీక్ , లోకేష్ పాల్గొన్నారు.






