నూత‌న కార్పొరేట‌ర్ల‌చే వెంట‌నే ప్ర‌మాణ స్వీకారం చేయించాలి: కార్పొరేట‌ర్ గంగాధ‌ర్ రెడ్డి

గ‌చ్చిబౌలి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఇటీవ‌ల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో కార్పొరేట‌ర్లుగా గెలిచిన అభ్య‌ర్థుల‌చే వెంట‌నే ప్ర‌మాణ స్వీకారం చేయించాల‌ని గ‌చ్చిబౌలి డివిజ‌న్ కార్పొరేట‌ర్ గంగాధ‌ర్ రెడ్డి డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు ముగిసి నెల రోజులు అవుతున్న‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయ‌క‌పోవ‌డంపై బీజేపీ నాయ‌కులు మంగ‌ళ‌వారం న‌గ‌రంలో ఉన్న సీఎం క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడించేందుకు య‌త్నించారు. ఆ కార్య‌క్ర‌మానికి వెళ్తున్న బీజేపీ కార్పొరేట‌ర్ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంద‌ర్భంగా గంగాధ‌ర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికైన కార్పొరేటర్ లచే వెంటనే ప్రమాణ స్వీకారం చేయించాల‌న్నారు. అలాగే వెంటనే జిహెచ్ఎంసి కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలని, జిహెచ్ఎంసి పాత కౌన్సిల్ రద్దు చేసి కొత్త కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్ట‌డికి బ‌య‌ల్దేరిన కార్పొరేట‌ర్ గంగాధ‌ర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here