నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని తాజ్ నగర్, సోఫా కాలనీ సొసైటీ నూతన కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అర్బన్ గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్ యూత్ కమిటీ సభ్యులతో పాటు ఎన్టీఆర్ నగర్ అసోసియేషన్ సభ్యులను ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్, మెమొంటోను అందజేశారు. ఎన్టీఆర్ నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. కాలనీలో రేషన్ దుకాణం లేకపోవడంతో నానక్ రాంగూడకు వెళ్లి నిత్యావసర సరుకులను తెచ్చుకోవాల్సి వస్తుందని వాపోయారు. డ్రైనేజీ, రోడ్లు, మంచి నీటి వ్యవస్థ సరిగా లేదన్నారు. ఎన్నికల్లో ఓటెయ్యడానికి గోపన్ పల్లికి వెళ్లాల్సి వస్తుందన్నారు. స్మశాన వాటిక, బస్తీ దవాఖానా లేవన్నారు. కాలనీలో కనీస మౌలిక వసతుకను కల్పించి అభివృద్ధికి కృషి చేయాలని కాలనీ అధ్యక్షుడు విఠల్, నర్సింహారెడ్డి, నాగ సుబ్రహ్మణ్యం, రాంచందర్ కాలనీ వాసులు కోరారు. సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి హామినిచ్చారు. యూత్ ఆధ్వర్యంలో ఎన్నుకోబడిన సభ్యులు కాలనీ సమస్యలపై దృష్టి సారించాలన్నారు. ఎన్టీఆర్ కాలనీ అభివృద్ధికి నాగ సుబ్రహ్మణ్యం చేసిన కృషిని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బిజెపి జెండా ఎగరడం ఖాయమన్నారు. నవ చైతన్యంనూతన యువజన కమిటీ అధ్యక్షునిగా చైతన్య, ఉపాధ్యక్షునిగా నవీన్, ప్రధాన కార్యదర్శిగా దుర్గారావు, సంయుక్త కార్యదర్శిగా కె నాగేంద్ర, కోశాధికారిగా కె. శ్రీను, ఆర్గనైజర్ ఆర్ రవీందర్, సలహాదారులుగా మనోజ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా రాము, సాయిరాం, విక్కీ, శివ ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్, సోఫా కాలనీ సొసైటీ అధ్యక్షునిగా బి విఠల్ , కార్యదర్శి నరసింహారెడ్డి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నాగ సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులుగా ఎం రామ సుధీర్ బాబు, శంకర్ నాయక్, సహాయ కార్యదర్శి గా విజయ్, మహమ్మద్ ఖలీల్, ఆర్గనైజర్ కార్యదర్శి గా సత్యవతి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా నగేష్, నాగేశ్వరరావు, కె రామచందర్, షేక్ బాబా, కె సత్యనారాయణ, ఏం చంద్ర ఎన్నికయ్యారు.
